కారణంతో, 24 జనవరి 2024
పోక్సో కేసుల్లో బాధితులైన చిన్నారికి శారీరక గాయాల వైద్య నివేదిక లేకపోయినా, ఆ కారణంతో పరిహారం నిరాకరించలేమని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న రాణి లక్ష్మీబాయి మహిళా, బాల సమ్మాన్ కోశ్ పథకం కింద పరిహారం పొందేందుకు అత్యాచారానికి సంబంధించిన గాయాల నివేదిక తప్పనిసరి అనే నిబంధనను కోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాణి లక్ష్మీబాయి పథకం కింద పరిహారం పొందేందుకు అత్యాచారానికి సంబంధించిన గాయాల నివేదిక తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించిన కోర్టు, ఆ నిబంధనను కొట్టివేస్తూ, బాధితురాలికి రూ.3 లక్షల ఆర్థిక సాయం పది రోజుల్లో విడుదల చేయాలని ఆదేశించింది. ఈ తీర్పును న్యాయమూర్తులు సరళ్ శ్రీవాస్తవ, గరిమా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం న వెలువరించింది.





