కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి 2018 నాటి పరువునష్టం కేసులో ఊరట లభించింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి 2018 నాటి పరువునష్టం కేసులో ఊరట లభించింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హర్షం వ్యక్తం చేశారు. గాంధేయ మార్గంలోనే పోరాటం కొనసాగిస్తామని, ప్రేమతోనే ప్రత్యర్థులను ఓడిస్తామని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బెంగళూరులో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీపై పరువునష్టం ఫిర్యాదు నమోదైంది. అప్పట్లో భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని భాజపా నేత విజయ్ మిశ్రా ఫిర్యాదు చేశారు.












