సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలు, అమ్మకం, యాజమాన్య బదిలీ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ., సంయుక్తంగా రూపొందించిన తొలి ఈజ్ ఆఫ్ వెహికల్ ఓనర్షిప్ ఇండెక్స్ () 2026లో ఏపీ 10కి 5.91 స్కోరుతో మొదటి ర్యాంకు సాధించింది. కేరళ 5.74 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది.
దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాహన యాజమాన్య బదిలీ ప్రక్రియను ఈ అధ్యయనం విశ్లేషించింది. పాలసీలు, డిజిటల్ సదుపాయాలు, ప్రక్రియ వేగం, పారదర్శకత, డీలర్లకు అందుబాటులో ఉన్న వ్యవస్థలు, ఖర్చులు వంటి ఆరు అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఏపీలో ఆర్సీ బదిలీకి 710 రోజులు
ఏపీలో వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ () బదిలీకి సాధారణంగా 7 నుంచి 10 రోజులు పడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. కొనుగోలుదారు, విక్రేత, రుణదాత బయోమెట్రిక్ ధ్రువీకరణ విధానం ద్వారా ప్రక్రియను పూర్తి చేయడం వల్ల ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం కొంత తగ్గిందని పేర్కొంది.
టాప్ రాష్ట్రాల ర్యాంకులు
ఆంధ్రప్రదేశ్ 5.91 కేరళ 5.74 తమిళనాడు 4.58 ఢిల్లీ 4.58 కర్ణాటక 4.30 తెలంగాణ 4.09
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి







