బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల అనంతరం రైల్లో పారిపోతున్న ముగ్గురు నిందితులను రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడి వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ముంబైలోని జుహు ప్రాంతంలో ఒక ఫుట్‌బాల్ మైదానం నుంచి టైగర్ ష్రాఫ్ బయటకు వస్తుండగా ఆదివారం సాయంత్రం ఆయన కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల సమయంలో ఆయనకు స్వల్ప గాయాలు కాగా, ప్రాణాపాయం తప్పింది. అయితే, ఆయన డ్రైవర్ ఫిర్దౌస్ ఇబ్రహీం బలోచ్ చేతికి బుల్లెట్ గాయం అయింది. ఉమేశ్ చౌహాన్ అనే వ్యక్తి ఛాతీలో బుల్లెట్ తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో బాలీవుడ్ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రైలులో పారిపోతుండగా పట్టివేత
కాల్పుల అనంతరం నిందితులు బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ముంబైలోని అంధేరి ప్రాంతంలో బైక్‌ను వదిలేసి, రైలులో ప్రయాణం ప్రారంభించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వారు సూరత్ నుంచి పుణెజైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. రైల్వే సీసీటీవీ ఫుటేజీ, ఇతర నిఘా సమాచారాన్ని పరిశీలించిన పోలీసులు రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కోటా రైల్వే స్టేషన్లో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ముంబై పోలీసులకు అప్పగించే ప్రక్రియ చేపట్టారు.











