మండలం భాకరాపేట గ్రామంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని గణేష్ మండపంలో విఘ్నేశ్వరునికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ఏకుల రాజేశ్వరి రెడ్డి పాల్గొని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నాయకులు, గ్రామ పెద్దలు ఆమెకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం ఏకుల రాజేశ్వరి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గణనాథుని కోరుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా ఎలాంటి విఘ్నాలు కలగకుండా, అన్ని విజయాలు వరించేలా దీవించాలని, రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా పరిపాలించే శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.












