మార్షల్ ఆర్ట్స్ సాధన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని రూరల్ సీఐ లింగప్ప అన్నారు. ఆదివారం కడపలో ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మార్షల్ ఆర్ట్స్ నిరంతరం సాధన చేయడం వల్ల ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, స్వీయ రక్షణతో పాటు ఇతరులను ఆదుకునే సామర్థ్యం వస్తుందని సీఐ లింగప్ప తెలిపారు. క్రీడల ద్వారా ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆత్మరక్షణ విద్య ఆవశ్యకత












