ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తగ్గించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌర సేవలు సకాలంలో అందేలా చూడటం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.










