వై.ఎస్.ఆర్ కడప, 6 October
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తిరుపతి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 11 మందికి రూ.1.10 లక్షల జరిమానా విధించారు. వీరిలో ఒకరికి జైలు శిక్ష కూడా పడింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రోడ్డు ప్రమాదాలను అరికట్టి ప్రజల భద్రతను పరిరక్షించే లక్ష్యంతో తిరుపతి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీఎస్పీ కొండయ్య నాయుడు పర్యవేక్షణలో తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.












