2027లో జరగనున్న భారత జనగణనలో ప్రజలకు తొలిసారిగా స్వీయ గణన సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది. జనవరి 10 నుంచి 24 వరకు ఆన్లైన్లో కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అనంతరం ప్రత్యేక గుర్తింపు సంఖ్య జారీ చేస్తారు.
2027లో జరగనున్న భారత జనగణనలో ప్రజలకు తొలిసారిగా స్వీయ గణన సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది. ఇందులో భాగంగా జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు ప్రజలు ఆన్లైన్లో తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకున్న వారికి ప్రత్యేక స్వీయ గణన గుర్తింపు సంఖ్య జారీ చేయబడుతుంది. ఈ సంఖ్యను ఇంటింటికీ వచ్చే జనగణన అధికారులకు అందించాల్సి ఉంటుంది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 24 వరకు అధికారులు ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలను సేకరించనున్నారు. దేశంలో తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో చేపట్టనున్న ఈ జనగణనలో కుల వివరాల సేకరణ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రజలు తమ కుటుంబ సభ్యులు, నివాస ప్రాంతం తదితర వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి









