అన్నమయ్య జిల్లాలో సంచలనం సృష్టించిన ఎనిమిదేళ్ల బాలుడిపై లైంగిక దాడి, హత్య కేసులో చిత్తూరు పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి మరణించే వరకు జైలులోనే ఉండేలా జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి శ్రీ అరుణ సారిక తీర్పు ఇచ్చారు. ఈ కేసులో పోలీసులు నెల రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేశారు.
నిందితుడి అరెస్ట్, దర్యాప్తు
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దర్యాప్తులో అదే గ్రామానికి చెందిన కాకులారం నందకుమార్ రెడ్డి అలియాస్ ఉదయ్ (20) బాలుడిని తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి, ఆ తర్వాత ఆధారాలు దాచేందుకు హత్య చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు కేసును హత్య (302 ), 377 , సాక్ష్యాధారాల ధ్వంసం (201 ), పోక్సో చట్టం 5() / 6 కిందకు మార్చారు.












