ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వివాదం రాజకీయంగా మరింత ముదురుతోంది. అధికార టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఎన్నికల అక్రమాలకు పాల్పడిందంటూ సీపీఐ, సీపీఎం పార్టీలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఈ ఆరోపణలకు నిరసనగా న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని రెండు వామపక్ష పార్టీలు నిర్ణయించాయి.
శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్య విధానాలను అధికార కూటమి ఉల్లంఘించిందని ఆరోపించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే పరిస్థితిని దెబ్బతీశారని విమర్శించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రతిపక్ష అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదని ఆరోపణలు
మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీల పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి అనుమతించలేదని, అభ్యర్థులను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు.










