ఆస్ట్రేలియాలో స్వతంత్ర పార్లమెంట్ సభ్యురాలు హెలెన్ హైన్స్ (65) పై కారుతో దాడి జరిగింది. విక్టోరియా రాష్ట్రంలోని వంగరట్టా పట్టణంలో ఆమె కార్యాలయం వెలుపల జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించి 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆస్ట్రేలియాలో స్వతంత్ర పార్లమెంట్ సభ్యురాలు హెలెన్ హైన్స్ ( , 65) పై దాడి జరిగింది. విక్టోరియా రాష్ట్రంలోని వంగరట్టా () పట్టణంలో ఆమె కార్యాలయం వెలుపల కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ ఆల్బనీస్, పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మెల్బోర్న్కు ఈశాన్యంగా సుమారు మూడు గంటల ప్రయాణ దూరంలో ఉన్న వంగరట్టా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెలెన్ హైన్స్ తన నియోజకవర్గ కార్యాలయం వెలుపల ఉండగా ఓ కారు ఆమెను ఢీకొట్టింది. తీవ్ర గాయాల కారణంగా అత్యవసర చికిత్స కోసం ఆమెను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ప్రజలకు మరింత ప్రమాదం లేదని విక్టోరియా పోలీసులు తెలిపారు.











