రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు & పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల ప్రాంగణం, హెలిప్యాడ్, ప్రజల కోసం చేయాల్సిన సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, రవాణా మరియు ఇతర అవసరాలపై అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు మంత్రి. ఈ సందర్భంగా, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.











