కడప, 2024-07-01
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి కడప నగరంలోని పలు వార్డు సచివాలయాలను బుధవారం సందర్శించారు. బీఎల్వోలు చేపడుతున్న ఓటరు వివరాల నమోదు, దరఖాస్తుల ప్రక్రియను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి బుధవారం కడప నగర పరిధిలోని మరియాపురం-1, మరియాపురం-2, ఏపీహెచ్‌బీ కాలనీ-1, ఏపీహెచ్‌బీ కాలనీ-2, స్వర్ణ వార్డు సచివాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వోలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యుల ఓటరు వివరాల నమోదు, దరఖాస్తు ఫారాల పూరణ, ఆన్లైన్ నమోదు ప్రక్రియను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.












