ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిదని ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘు అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
చైర్ పర్సన్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఆయన చేసిన ప్రజా ఉద్యమాలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారని, మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు మనమందరం కృషి చేసినప్పుడే ఆయనకు మనం నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోనె దామోదర్, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










