వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకువస్తోంది. ఈరోజు రాత్రికి విశాఖపట్నం-గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో, నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
గత 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వాయుగుండం, ప్రస్తుతానికి గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్లు, కళింగపట్నానికి 100 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరీకి 220 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.












