జిల్లాలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి కారుతో బీభత్సం సృష్టించాడు. పీలేరు - మదనపల్లి టర్నింగ్ సమీపంలోని ఇంద్రానగర్ మొదటి వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు రోడ్డుపై ఉన్న వాహనాలను వరుసగా ఢీకొట్టింది. దీంతో వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఆ సమయంలో ఆ ప్రాంతంలో చిన్నారులు ఆడుకుంటుండటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
స్థానికుల అప్రమత్తత












