పట్టణంలోని కొఠారి గల్లీలో మంగళవారం సాయంత్రం మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి, మహిళను హత్య చేసి, నగదు, బంగారు ఆభరణాలను అపహరించుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పట్టణంలోని కొఠారి గల్లీలో మంగళవారం సాయంత్రం మహిళ దారుణ హత్యకు గురైంది. పట్టణ సీఐ బి. నరహరి తెలిపిన వివరాల ప్రకారం, కొఠారి గల్లీకి చెందిన సుదర్శన్, అనసూయ దంపతులు నివాసం ఉంటున్నారు. సుదర్శన్ మంగళవారం సాయంత్రం సుమారు 6.30 నుంచి 7.30 గంటల మధ్య గుడికి వెళ్లగా, అనసూయ ఇంట్లో ఒంటరిగా ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అనసూయ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడు, చెవి కమ్మలు, చేతికి ఉన్న ఉంగరాలను అపహరించి అక్కడి నుంచి పరారైనట్లు పేర్కొన్నారు.












