రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరు పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రోటోకాల్‌కు అనుగుణంగా, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్. సవిత, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు సూచించారు.
ఆదివారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్. సవిత, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌లతో కలిసి ప్రొద్దుటూరు అమృత్‌నగర్‌లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాటు చేసిన రెండు హెలీప్యాడ్లను పరిశీలించారు. హెలీప్యాడ్ల వద్ద భద్రత, వాహనాల రాకపోకలు, పార్కింగ్, ఇతర అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జలజీవన్ మిషన్అమరజీవి జలధార కార్యక్రమ లాంచింగ్ కోసం ఏర్పాటు చేసిన పైలాన్‌ను మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించి, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తదుపరి బహిరంగ సభా ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీలు భద్రతా ఏర్పాట్లు, వీఐపీ గ్యాలరీలు, సభా వేదిక, ప్రజల గ్యాలరీలు, పార్కింగ్, రాకపోకల మార్గాలు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీతో చర్చించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా చర్యలు పకడ్బందీగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వైద్య సదుపాయాలు, పార్కింగ్, రవాణా తదితర సౌకర్యాలు సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. కార్యక్రమం విజయవంతంగా జరిగేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీల వెంట పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. స్థానికంగా ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, సభా ప్రాంగణానికి ప్రజల రాకపోకలకు సంబంధించిన అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పర్యటనకు సంబంధించిన ప్రతి ఏర్పాటును సంబంధిత శాఖలు సమన్వయంతో పర్యవేక్షించాలని, ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, స్థానిక నాయకులు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.










