గోపవరం మండలం మడకలవారిపల్లిలో జరిగిన భారీ చోరీ కేసును బద్వేలు రూరల్ పోలీసులు ఛేదించారు. కుటుంబంతో తిరుపతి వెళ్లిన సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి రూ.3.25 లక్షల విలువైన నగదు, బంగారం, వెండి వస్తువులను అపహరించిన అంతర్ జిల్లా దొంగను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అతడి వద్ద నుంచి వెంకటేశ్వర స్వామి బొమ్మతో కూడిన బంగారు ఉంగరం, లేత పచ్చరంగు రాయితో కూడిన బంగారు ఉంగరం, రెండు చిన్న వెండి దీపపు సెమ్మెలు, రూ.5,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిందితుడిపై ఏపీ, తెలంగాణలో 30కి పైగా చోరీ కేసులు ఉన్నట్లు తేలింది. క్రిమినల్ సిండికేట్‌గా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఈ కేసులో సెక్షన్ 111 (ఆర్గనైజ్డ్ క్రైమ్) కింద కేసు నమోదు చేశారు.












