సిద్దవటంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో సేవా సంకల్ప బైక్ ర్యాలీని నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జయంతి, 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని ఈ ర్యాలీని , టీడీపీ, జనసేన నాయకులు చేపట్టారు. ఈ ర్యాలీ పోలీస్ లైన్ నుండి దిగువపేట వరకు అత్యంత వైభవంగా సాగింది.
దేశవ్యాప్తంగా జరుగుతున్న సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా ఈ బైక్ ర్యాలీని నిర్వహించినట్లు మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, టీడీపీ మండల అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ, దేశ సేవ, స్వచ్ఛత, ప్రజా సంక్షేమం, మహిళా సాధికారికత, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతున్న ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పాలనలో, పవన్ కళ్యాణ్, పి.వి.ఎన్ మాధవ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి, రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతోందని నాయకులు తెలిపారు. ప్రధాని మోడీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, టీడీపీ మండల అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్, క్లస్టర్ ఇంచార్జి రాజా నాయుడు, రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి, జనసేన ఏఎంసీ డైరెక్టర్ మహబూబ్ బాషా (బాబి), టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు మునెయ్య, మండల కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బూసి కిరణ్ కుమార్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు ముసలి బాలక్రిష్ణా రెడ్డి, రాజంపేట అసెంబ్లీ టీడీపీ తెలుగు యువత ఉపాధ్యక్షులు నాగభూషణం, జంగాలపల్లి మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










