త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున పోటీ చేయడానికి ప్రజాసేవా దృక్పథం కలిగిన సమర్థవంతమైన అభ్యర్థులు ముందుకు రావాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు, రాయచోటి అసెంబ్లీ ఇన్చార్జి యుగంధర్ అబ్బవరం పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు బహుజనుల రాజకీయ భవిష్యత్తుకు కీలకమని, గ్రామ స్థాయి నుంచే అధికారం బహుజనుల చేతుల్లోకి రావాలని, అందుకోసం బీఎస్పీ బలంగా పోటీ చేయనుందని యుగంధర్ అబ్బవరం తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యువత, మహిళలు, విద్యావంతులు, సామాజిక కార్యకర్తలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఇతర బహుజన వర్గాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.









