జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను - జర్నలిస్టులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రజా పాలన మరింత మెరుగ్గా కొనసాగాలని, పేద బడుగు వర్గాలతో పాటు జర్నలిస్టుల ఆకాంక్షలను నెరవేర్చాలని వారు కలెక్టర్‌ను కోరారు.
- జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో, కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి, ఆయనకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. కలెక్టర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆపదలో ఉన్న పేద ప్రజలకు పెద్దదిక్కుగా ఉండాలని, అందుకు తగిన ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని జర్నలిస్టులు కోరారు. జిల్లాలో జర్నలిస్టులకు అండగా ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి విజ్ఞప్తి చేశారు.












