కామారెడ్డి, జిల్లాల్లో ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ కాయిల్స్ చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా ముఠాలో పరారీలో ఉన్న మరో నిందితుడు తక్ షంషేర్ సింగ్‌ను భిక్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మరో చోరీకి రెక్కీ నిర్వహిస్తున్న సమయంలో అతడిని పట్టుకున్నారు.
కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో ఇదే కేసులో బల్జీత్ సింగ్ చతుర్ సింగ్ తక్, రూప్ సింగ్ చతుర్ సింగ్ తక్, లఖన్ చతుర్ సింగ్ తక్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న షంషేర్ సింగ్‌ను తాజాగా పట్టుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విచారణలో నిందితుడు మొత్తం 54 ట్రాన్స్ఫార్మర్ చోరీ కేసుల్లో తన ప్రమేయం ఉన్నట్లు వెల్లడించాడు. కామారెడ్డి, జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 73 ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు.












