రానున్న దుర్గ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో దేవి నవరాత్రి ఉత్సవ నిర్వాహకులతో శాంతి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డి.ఎస్.పి శ్రీ మధుసూదన్, ఇన్స్పెక్టర్ నరహరి హాజరయ్యారు.
కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో రానున్న దుర్గ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కామారెడ్డి డి.ఎస్.పి శ్రీ మధుసూదన్, ఇన్స్పెక్టర్ నరహరి హాజరయ్యారు. ఇటీవల కామారెడ్డి పట్టణంలో జరిగిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి ఆటంకాలు లేకుండా, డప్పు చప్పులతో విజయవంతంగా నిర్వహించబడ్డాయని తెలిపారు. అదేవిధంగా, దేవి నవరాత్రి ఉత్సవాలను కూడా కామారెడ్డి పట్టణ ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు ప్రశాంత వాతావరణంలో, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవి నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











