గజ్వేల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా స్థాయి చదరంగం పోటీలు ఆదివారం ఎస్పీఆర్ హై స్కూల్లో జరిగాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన పదిమంది విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. విద్యార్థులలో మేధోశక్తిని వెలికితీయడమే ఈ పోటీల లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
అతిథుల సందేశం
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన డీవైఎస్ఓ రంగ వెంకటేశ్వర్ గౌడ్, కామారెడ్డి అథ్లెటిక్స్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కె.పి. అనిల్ కుమార్, ఎస్పీఆర్ పాఠశాల కరస్పాండెంట్ కొమిరెడ్డి మారుతి గారు మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడతాయని, చదరంగం వంటి మేధోపరమైన ఆటలు మెదడుకు పదును పెడతాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.












