అన్నమయ్య జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలం బొమ్మనచెరువు వద్ద కొత్తిమీర లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రామసముద్రం మండలం, చెంబకూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, బొలెరో వాహనం అతివేగంగా వస్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల పూర్తి వివరాలు, పేర్లు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పోలీసుల విచారణ












