కామారెడ్డి జిల్లాలో నెలలు నిండకుండానే ప్రసవించిన మగ శిశువుకు అంబులెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి ప్రాణాలను కాపాడారు. శిశువుకు వెంటిలేషన్, ఆక్సిజన్ అందించి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మండలం భవానిపేట తండాకు చెందిన మంజుల నెలలు నిండకుండానే 3వ కాన్పులో నొప్పులు రావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో మగ బిడ్డ జన్మించారు. అయితే, పుట్టిన బిడ్డ అపస్మారక స్థితిలో ఉండటం, ఏడవకపోవడం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడటంతో స్థానిక శిశు వైద్య నిపుణుడు చికిత్స అందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మార్గమధ్యంలో బాబుకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో, అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అంబు బ్యాగ్ తో వెంటిలేషన్ అందిస్తూ, ఆక్సిజన్ సపోర్ట్ తో పాటు ఇంక్యుబేటర్ లో ఉంచి, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సురక్షితంగా తరలించారు.












