స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్నవి ఏకగ్రీవాలు కావని, అధికార మదంతో కూటమి పార్టీలు చేసిన బలాత్కారాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఇవి ప్రజా ఆమోదం కాదని, కూటమి పార్టీల అరాచకానికి నిదర్శనమని ఆమె అన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కూటమి కమిషన్‌గా మార్చి, నడిరోడ్డుపై రాజ్యాంగాన్ని ఖూనీ చేసి, పోలీసు వ్యవస్థను బానిసగా చేసి, కళ్ళముందే నామినేషన్ పత్రాలు చించి, ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ రక్తపాతంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన ఘనత కూటమి పార్టీలదని ఆమె మండిపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల వ్యవస్థను అవహేళన చేసి, ప్రజల హక్కులను అపహాస్యం చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని ఆమె అన్నారు.











