మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌లో రిగ్గింగ్‌ను అరికట్టాలని, అభ్యర్థులకు, పోలింగ్ ఏజెంట్లకు, ఓటర్లకు రక్షణ కల్పించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మేయర్ అభ్యర్థి వాసు యాదవ్, 63 మంది కార్పొరేటర్ అభ్యర్థులు నిరసన తెలిపారు.
నామినేషన్ల సమయంలో తమ పార్టీ అభ్యర్థులపై దాడులు జరిగాయని, నామినేషన్ పత్రాలను చించివేసి దాఖలు చేయకుండా అడ్డుకున్నారని భూమన అభినయ్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం కార్పొరేటర్ అభ్యర్థులు, వారి పోలింగ్ ఏజెంట్లకు ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని, పోలింగ్ రోజున రిగ్గింగ్, దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అధికారులకు ఫిర్యాదులు











