ప్రకృతి వ్యవసాయంలో విశేష ప్రతిభ కనబరిచిన వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఇద్దరు రైతులకు ప్రతిష్టాత్మక కిసాన్ మహారాజ్ అవార్డులు 2026 లభించాయి. మండలం అబుసాహెబ్పేటకు చెందిన గోగుల రాధాకృష్ణ, బాలసింగాయపల్లి (చెన్నూరు మండలం)కి చెందిన దండిబోయిన బాలాజీ ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వరి, కరివేపాకు, పసుపు పంటల సాగులో వీరి కృషికి గుర్తింపు లభించింది.
హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో విష్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మహారాజ్ అవార్డుల ప్రదానోత్సవంలో వారికి పురస్కారాలు అందజేశారు. సహజ వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధించడంతో పాటు సమర్థవంతమైన ఉత్పత్తులు అందించినందుకు వీరిని ఎంపిక చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి స్పందిస్తూ, సహజ వ్యవసాయ విధానాల ద్వారా పంటల సాగులో ప్రతిభ కనబరిచి జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చిన రైతుల కృషి అభినందనీయమన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ, ఏపీసీఎన్ఎఫ్ అధికారుల సేవలను ప్రశంసించారు.












