జిల్లాలో రేపు జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు. మదనపల్లెలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ లను ఎస్పీ స్వయంగా తనిఖీ చేశారు.
సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఐఏఎస్, డీఎస్పీ బి. ప్రసాద్, ఎన్నికల అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రత దృష్ట్యా పటిష్ట మూడంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బ్యాలెట్ బాక్సుల తరలింపుపై నిఘా











