దీపావళి పండుగ వేళ బాణసంచా కాల్చడం విషయంలో మొదలైన వివాదం హింసాత్మక దాడికి దారితీసింది. అహ్మదాబాద్‌లోని ఎంపైర్ స్కైవ్యూ అపార్ట్మెంట్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు నివాసితులు గాయపడ్డారు. దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి తన లైసెన్స్డ్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ సైన్స్ సిటీ రోడ్డులో ఉన్న ఎంపైర్ స్కైవ్యూ అపార్ట్మెంట్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు నివాసితులు గాయపడ్డారు. దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి తన లైసెన్స్డ్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గాల్లోకి కాల్పులతో ఆగిన దాడి
దాడి తీవ్రత పెరగడంతో అపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ వ్యక్తి తన లైసెన్స్డ్ పిస్టల్‌తో గాల్లోకి రెండు మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో దాడి చేసినవారు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. కాల్పులు జరిపిన వ్యక్తి చర్యపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.











