భారతదేశానికి చెందిన సొంత సోషల్ మీడియా వేదిక అందుబాటులోకి వచ్చింది. వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు, వ్యాపార సంస్థలు, మీడియా, ప్రభుత్వ సంస్థలు ఒకే చోట అనుసంధానం కావడానికి ఈ ప్లాట్‌ఫామ్ వీలు కల్పిస్తుంది.
సోషల్ మీడియా రంగంలో భారతదేశానికి మరో కొత్త వేదిక అందుబాటులోకి వచ్చింది. పేరుతో రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు, వ్యాపార సంస్థలు, మీడియా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఒకరితో ఒకరు అనుసంధానం కావచ్చు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రత్యేకతలు
ఈ వేదికలో వినియోగదారులు వ్యక్తిగత లేదా వృత్తిపరమైన ప్రొఫైల్‌ను రూపొందించుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు, పోస్టులు షేర్ చేయడంతో పాటు ఇతర వ్యక్తులు, సంస్థలను ఫాలో కావచ్చు. పోస్టులకు లైక్, కామెంట్, రీపోస్ట్ చేసే సదుపాయం ఉంది. ఆసక్తులకు అనుగుణంగా కమ్యూనిటీలను కనుగొనవచ్చు. వ్యాసాలు, ఈవెంట్ల వివరాలను ప్రచురించవచ్చు. వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రొఫైళ్లను నిర్వహించుకోవచ్చు. ప్రైవసీ సెట్టింగ్స్, రిపోర్ట్, బ్లాక్ వంటి భద్రతా సదుపాయాలు కూడా ఉన్నాయి.











