కామారెడ్డి, 31.07.2026
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, వర్షాల ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షాల ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రధాన రోడ్డుపై నిల్వ ఉన్న వర్షపు నీటిని వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రి ఆవరణలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు అవసరమైన అంచనాలను వెంటనే సిద్ధం చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భారీ వర్షాలతో పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు ప్రవహిస్తున్న నేపథ్యంలో చెరువు వద్ద సంప్రదాయ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరువు పరిసరాలను పరిశీలించి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లవద్దని జాలర్లను హెచ్చరించారు. ప్రజలు ప్రమాదవశాత్తు చెరువు వైపు వెళ్లకుండా తగిన బారికేడ్లు ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని మున్సిపల్, పోలీసు అధికారులను ఆదేశించారు.












