రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఆవు అమ్మకం విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం దారుణ హత్యకు దారితీసింది. భర్త చున్నీలాల్ తన భార్య చుంకీ దేవిపైకి పికప్ వాహనాన్ని నడిపించి ఆమెను హత్య చేశాడు. అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
జిల్లా కొలిడా గ్రామానికి చెందిన చున్నీలాల్ కుమావత్ (56) తన భార్య చుంకీ దేవి (52)తో ఆవు అమ్మకం విషయంలో గొడవపడ్డాడు. ఆవును అమ్మాలన్న భర్త నిర్ణయాన్ని భార్య వ్యతిరేకించింది. దీంతో ఆగ్రహానికి గురైన చున్నీలాల్, ఇంటికి సుమారు 100 మీటర్ల దూరంలో భార్యపైకి పికప్ వాహనాన్ని నడిపించి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఘటన అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో నిందితుడికి సుమారు రూ.15 లక్షల అప్పులు ఉన్నట్లు వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు.











