హైదరాబాద్‌లో అక్రమ అండాల సేకరణ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలను లక్ష్యంగా చేసుకుని, డబ్బు ఆశ చూపి ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఒక్కోసారి అండాల దానం కోసం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లిస్తామని ఆశ చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో అక్రమ అండాల సేకరణ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలను లక్ష్యంగా చేసుకుని, డబ్బు ఆశ చూపి ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఒక్కోసారి అండాల దానం కోసం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లిస్తామని ఆశ చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. బేగంపేట, సరూర్‌నగర్, ఎర్రగడ్డ, ప్రకాశ్‌నగర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి 43 మంది మహిళలను రక్షించారు. ఈ కేసులో పలువురిని అరెస్టు చేశారు. మహిళలను అద్దె గదుల్లో ఉంచి ఐవీఎఫ్, సంతాన సాఫల్య కేంద్రాలకు పంపుతున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ వ్యవహారంలో హార్మోన్ల ఇంజెక్షన్లు, మందులు వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు పరిశీలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న మందులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. మరోవైపు మూడు ఆసుపత్రులు, మూడు సంతాన సాఫల్య కేంద్రాల రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆధార్ వివరాలు, సమ్మతి పత్రాలు, వివాహ స్థితి, వైద్య వివరాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఏఆర్టీ కేంద్రాలు, మధ్యవర్తులు, ఫెర్టిలిటీ కేంద్రాల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళల ఆరోగ్య భద్రత, చట్టపరమైన నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే అంశాలు తేలాల్సి ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి









