సాధారణ ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్లో కొంత భాగాన్ని పొటాషియం క్లోరైడ్‌తో భర్తీ చేసి తయారుచేసే ప్రత్యామ్నాయ ఉప్పు ఆరోగ్యానికి మేలు చేస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ ఉప్పు వాడకంతో భారత్‌లో ఏటా సుమారు 4 లక్షల మరణాలను, 15 లక్షలకు పైగా గుండె, మూత్రపిండాల వ్యాధుల కేసులను నివారించవచ్చని పరిశోధకులు అంచనా వేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ మార్పు ద్వారా దాదాపు 30 లక్షల మరణాలను అరికట్టవచ్చని అధ్యయనం తెలిపింది. అధికంగా సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. పొటాషియం కలిపిన ఉప్పు సోడియం మోతాదును తగ్గించడంతో పాటు శరీరానికి అవసరమైన పొటాషియంను అందిస్తుంది. ఇది సాధారణ ఉప్పులాగే కనిపించడం, రుచిలో తేడా లేకపోవడం, వంటల్లో సులభంగా ఉపయోగించుకోవడం దీని ప్రత్యేకతలు. అయితే, తీవ్రమైన మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు, రక్తంలో పొటాషియం స్థాయిని పెంచే మందులు వాడేవారు వైద్యుల సలహా లేకుండా ఈ ఉప్పును ఉపయోగించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రత్యామ్నాయ ఉప్పు వాడకంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అధ్యయనం పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











