జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ గారు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరూ రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ గారు ఈరోజు సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇరువురి మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహం నేపథ్యంలో జరిగిన ఈ ఆత్మీయ భేటీలో, గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో చోటుచేసుకున్న పలు అంశాలను వారు గుర్తుచేసుకున్నారు.











