బాల్కొండ, 4 September
మండల కేంద్రంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ లో శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపాల్ జె శ్రీ ప్రియా ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఢిల్లీ వరల్డ్ స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు మండల కేంద్రంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ లో శుక్రవారం ప్రిన్సిపాల్ జె శ్రీ ప్రియా ఆధ్వర్యంలో విద్యార్థులు శ్రీకృష్ణ జన్మాష్టమి నేత్రపర్వంగా నిర్వహించారు. చిన్ని కృష్ణయ్య గోపికల వేషాధారణములు ఆకట్టుకున్నాయి. కృష్ణయ్య పూజలు జరిపారు. ఉట్టి కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, చైర్మన్ హారిక, కోర్డినేటర్ ప్రశాంత్, అడ్మిషన్ ఇంచార్జ్ అరుణ,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు












