పంజాబ్‌లోని కపుర్తలాలో దీపావళి రోజున ఇంటి ముందు టపాసులు కాల్చుతున్న 27 ఏళ్ల యువ రెజ్లర్ మణి అలియాస్ పెహల్వాన్‌ను దుండగులు కాల్చి చంపారు.
పంజాబ్‌లోని కపుర్తలా పట్టణం మెహతాబ్గఢ్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మణి తన ఇంటి బయట దీపావళి టపాసులు కాలుస్తుండగా, మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం. ఒక బుల్లెట్ మణి ఛాతిలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే కపుర్తలా సివిల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మణి అసలు లక్ష్యం కాదా
ఈ ఘటనలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, దుండగులు మణిని కాకుండా అదే ప్రాంతంలోని మరో వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మణి అనుకోకుండా బుల్లెట్‌కు బలై ఉండవచ్చని డీఎస్పీ శీతల్ సింగ్ వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. అయితే, మణికి ఎవరితోనూ వ్యక్తిగత గొడవలు లేదా శత్రుత్వం లేదని అతడి తండ్రి బగ్గ తెలిపారు. కాల్పుల వెనుక అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.











