మౌ, 25 మే 2025
ఉత్తరప్రదేశ్‌లో ఒక హత్య కేసు నిందితుడు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో తన మరణంపై నకిలీ ఆధారాలు సృష్టించి, కోర్టు విచారణ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాను చనిపోయినట్లు నమ్మించేందుకు మేక కళేబరాన్ని దహనం చేసి, దానిపై తన ముఖాన్ని జతచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఆధారాలతో మరణ ధ్రువీకరణ పత్రం పొందిన అతడిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాకు చెందిన 38 ఏళ్ల రాజ్‌కుమార్ రాజ్‌భర్ అలియాస్ రాజు 2016లో జరిగిన యోగేష్ సింగ్ హత్య కేసులో నిందితుడు. మున్షిపురా రైల్వే లైన్ సమీపంలో యోగేష్ సింగ్ కాల్పుల్లో మృతి చెందగా, ఈ ఘటనపై మృతుడి మేనల్లుడు అవినాష్ సింగ్ ఫిర్యాదు మేరకు రాజ్‌కుమార్‌తో పాటు అతడి స్నేహితుడు సుదర్శన్ రాజ్‌భర్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో రాజ్‌కుమార్ బెయిల్‌పై బయట ఉన్నాడు.










