గోపాల్ నగర్ లో కబ్జాకు గురైన సుమారు ఒక ఎకరం స్థలాన్ని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. స్థానికుల విన్నపం మేరకు రమేష్ తీసుకున్న చర్యలు ఫలించాయి.
ప్రజాోపయోగం కోసం వదిలిన ప్రతి స్థలాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని టిపిసిసి ఉపాధ్యక్షుడు బండి రమేష్ పేర్కొన్నారు.
వసంత నగర్ డివిజన్ పరిధిలోని గోపాల్ నగర్ లో కబ్జాకు గురైన సుమారు ఒక ఎకరం స్థలాన్ని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది.
గత ప్రభుత్వంలోని నాయకులు కొంతమంది గుండాలు పార్కు స్థలాన్ని కబ్జా చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు.
సంస్థానికులు రమేష్ కి విన్నవించడంతో ఆయన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.







