భారతదేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా అన్నారు. దేశాన్ని ఒక్కటిగా నిలబెట్టడంలో పటేల్ చూపిన నాయకత్వం, సంకల్పం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. శనివారం అగర్తలాలో జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని త్రిపుర రాజధాని అగర్తలాలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్వామి వివేకానంద మైదానంలో జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాణిక్ సాహా పాల్గొని పటేల్ చిత్రపటానికి నివాళులర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పటేల్ కీలక పాత్ర
ఈ సందర్భంగా సీఎం మాణిక్ సాహా మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం దేశంలోని వందలాది సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన దృఢ సంకల్పం, దూరదృష్టి కారణంగానే దేశ రాజకీయ సమైక్యతకు బలమైన పునాదులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.












