కడప, 2024-07-04
జిల్లాలో ఇటీవల అనారోగ్యం మరియు రోడ్డు ప్రమాదాలలో మరణించిన ముగ్గురు పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను మంజూరు చేస్తూ నియామక పత్రాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపిఎస్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా మరణించిన సిబ్బంది కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కారుణ్య నియామకాలను చేపడుతోందని ఎస్పీ తెలిపారు.
జిల్లాలో ఇటీవల అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాలలో మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు ముగ్గురికి జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ లుగా నియమిస్తూ కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపిఎస్ శనివారం అందచేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపిఎస్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధులు నిర్వహించే సిబ్బంది ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తుంటారని, అటువంటి సిబ్బంది అకాల మరణం కుటుంబాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తుందన్నారు. మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక సమస్యలను, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి కుటుంబంలోని అర్హత కలిగిన వ్యక్తులలో ఒకరికి ప్రభుత్వం కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తూ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందచేయడం జరిగిందన్నారు.












