ప్రొద్దుటూరు / కడప జిల్లా (డాక్సిన్ టైమ్స్) జూలై 02
వైఎస్ఆర్ కడప జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
గురువారం విజయవాడ నుంచి ఎస్ఐఆర్ నిర్వహణ, సన్నాహక చర్యలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రొద్దుటూరు తహశీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు, ఎస్ఐఆర్ నమోదు ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పురోగతిపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.












