సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ () 202627 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో, పన్నెండో తరగతుల విద్యార్థుల వివరాల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు పాఠశాలలకు అవకాశం కల్పించింది. ఇందుకోసం సవరణల విండో అందుబాటులో ఉండనుంది.
పాఠశాలలు బోర్డుకు సమర్పించిన విద్యార్థుల జాబితా ( )లోని వివరాలను గడువులోపు పరిశీలించి, అవసరమైన మార్పులు చేయవచ్చు. విద్యార్థుల వ్యక్తిగత వివరాలతో పాటు, ముఖ్యంగా సబ్జెక్టుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సవరణల ఆవశ్యకత
పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా, విద్యార్థుల రికార్డుల్లో ఖచ్చితత్వం ఉండేలా ఈ సవరణ అవకాశం కల్పించినట్లు సమాచారం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల వివరాలు, ముఖ్యంగా ఎంచుకున్న సబ్జెక్టులను పాఠశాల ద్వారా మరోసారి నిర్ధారించుకోవడం మంచిది.
ముఖ్యమైన సూచన
ఈ సవరణ ప్రక్రియను విద్యార్థులు నేరుగా కాకుండా, సంబంధిత పాఠశాలల ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు తనిఖీ చేయాల్సిన వివరాలు: విద్యార్థి పేరు, తండ్రి/తల్లి/సంరక్షకుల పేర్లు, పుట్టిన తేదీ, పదో, పన్నెండో తరగతుల్లో ఎంచుకున్న సబ్జెక్టులు, పాస్‌పోర్ట్ ఉంటే అందులోని వివరాలతో సరిపోలుతున్నాయా లేదా అని నిర్ధారించుకోవాలి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి







