రాజంపేట, 13 September
మండలంలో వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మున్సిపాలిటీతో పాటు రూరల్ ప్రాంతాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వైఎస్సార్సీపీ స్థానిక విజయానిదే లక్ష్యం: ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి పిలుపు డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ కడప డాక్షిన్ టైమ్స్ .వైఎస్ఆర్ జిల్లా మండలంలో వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మున్సిపాలిటీతో పాటు రూరల్ ప్రాంతాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరవేసే లక్ష్యంగా ఈ భేటీలో దిశానిర్దేశం చేశారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఒకరికొకరు సమన్వయంతో క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే ఆకేపాటి పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన శ్రేణులను వైఎస్సార్ సీపీ ఎన్నటికీ మర్చిపోదని, తగిన ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. స్థానిక ప్రజా సమస్యలను నిరంతరం గుర్తిస్తూ, వారి తరఫున గళమెత్తి పోరాటాలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. వైఎస్సార్సీపీ శ్రేణులంతా ప్రజాక్షేత్రంలో బలంగా నిలిచి పోరాడాలని ఆయన ఉద్బోధించారు.











