నిజామాబాద్, 12 September
ఆర్మూర్ పట్టణ నూతన మున్సిపల్ భవన నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.7.5 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధుల మంజూరుతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆర్మూర్ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ బిగ్ బూస్ట్! జిల్లా ప్రతినిధి (దక్షిణ్ టైమ్స్) : ఆర్మూర్ పట్టణ నూతన మున్సిపల్ భవన నిర్మాణానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రూ.7.5 కోట్ల నిధులు విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ అన్నలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆర్మూర్ పట్టణ అభివృద్ధిలో నూతన మున్సిపల్ భవనం కీలకంగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించేందుకు ఆధునిక వసతులతో భవనం నిర్మాణం పూర్తిచేయాలని ఆకాంక్షించారు. ఆర్మూర్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.











