కామారెడ్డి, 2014-02-28
కటాఫ్ తేదీని తొలగించి అర్హులైన బీడీ కార్మికులందరికీ చేయూత పెన్షన్ అందించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట శుక్రవారం యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అసిస్టెంట్ ఆఫీసర్ (ఏఓ)కు అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కటాఫ్ డేట్ తొలగించి బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏఓకు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 7.50 లక్షల మంది, కామారెడ్డి జిల్లాలో 50 వేల మంది బీడీ కార్మికులు ఉన్నారని తెలిపారు. చాలీచాలని కూలీతో బీడీ కార్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి 28-02-2014ను కటాఫ్ డేట్‌గా నిర్ణయించడంతో వేలాది మంది అర్హత కోల్పోయారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో కటాఫ్ డేట్ తొలగించి అర్హులైన ప్రతి బీడీ కార్మికుడికి చేయూత పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయడం లేదని విమర్శించారు. పాత లబ్ధిదారులకు రూ.4,016 పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇతర వర్గాలకు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ బీడీ కార్మికులకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. కామారెడ్డి జిల్లాలోని బీడీ కార్మికుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి అర్హులైన ప్రతి కార్మికుడికి చేయూత పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఏ. ప్రకాష్, జిల్లా నాయకులు ఎస్. కిషోర్, వెంకన్నతో పాటు బీడీ కార్మికులు గొండమ్మ, స్వప్న, ఆఫ్సిక, లక్ష్మి, రేణుక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.












